School Bus:స్కూల్ వ్యాన్ ఢీకొని బాలిక మృతి

Karimnagar:స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

మల్యాల మండల మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన సోదరుడు స్కూల్​(School) వెళుతూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు. తన సోదరునితో వెళ్లాలనే ఆలోచనతో స్కూల్ బస్సు (School Bus)ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనించడంతో ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించడం జరిగింది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఆలీఫా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్