ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పెషల్ కోర్టులో విచారణ జరుగనుంది. పిటిషన్‌లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.
లిక్కర్ కేసుకు సంబంధించి నేడు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇక, పిటిషన్‌లో కవిత(MLC Kavitha) పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.
కవిత వాదనలను ఈడీ(ED) అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..’కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్‌లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను (Whatsapp Data)డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్‌ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు’ అని కోరుతున్నారు.