సార్వత్రిక ఎన్నికల వేడిలోనే కంటోన్మెంట్ అసెంబ్లీ సమరం కూడా ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య నందిత (Lasya Nanditha) మృతితో…కంటోన్మెంట్ స్థానంలో ఉప్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు మే 13న ఈ అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తారు.
కంటోన్మెంట్(Cantonment) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని పెట్టాలా అనే అంశంపై బీఆర్‌ఎస్ కసరత్తు పూర్తి చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో, పార్టీ నేతలతో కలిసి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆలోచనలు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ భేటికి కేటీఆర్, హరీష్‌రావు కూడా హాజరయ్యారు. దివంగత లాస్య నందిత కుటుంబ సభ్యులతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గులాబీ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
సాదారణంగా ప్రజాప్రతినిధులు అకాల మరణంతో వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ లేకుండానే కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారు. కానీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ నాలుగు నెలల్లోనే ఉప ఎన్నికలు వచ్చాయి. లాస్య నందిత సొదరి నివేదిత (Niveditha)టికెట్ ఆశిస్తున్నట్ల ప్రకటించినా బీఆర్‌ఎస్ మాత్రం ఆసక్తి చూపించకలేదు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ శ్రీగణేష్‌ను ప్రకటించింది. దీంతో ఉద్యమకారుడు గజ్జెల నగేష్ ను కారు పార్టీ ప్రకటించాలని బావించింది. చివరకు సాయన్న కుటుంభానికే టికెట్ ఇవ్వడంతో సెంటిమెంట్‌తోపాటు సాయన్న బలం బీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని బాస్ గుర్తించి నివేదితకే టికెట్ ఖరారు చేశారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…