Kim Jon Un : ఇదెక్కడి శాడిజం.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష

ManaEnadu:ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ డిక్టేటర్ పాలన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఎప్పుడూ ప్రజలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న తప్పులకే ఘోర శిక్షలు విధిస్తుంటారు. కిమ్ కర్కశత్వానికి ఇప్పటికే చాలా మంది బలైపోయారు. తాజాగా కిమ్ శాడిజానికి ఏకంగా 30 మంది అధికారుల ప్రాణాలు పోయాయి. ఇంతకీ

ఏం జరిగిందంటే?
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) రాజ్యంలో ఇటీవల భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. స్వయంగా తానే వెళ్లి వరద బీభత్సాన్ని పలుమార్లు కిమ్ పరిశీలించారుకూడా. అయితే తాజాగా ఆయన తమ దేశంలోని దాదాపు 30మంది ప్రభుత్వ అధికారులకు మరణ శిక్ష అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల వరదల (North Korea Floods) నేపథ్యంలో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20-30 (30 Officers Execution) మంది ప్రభుత్వ అధికారులకు కిమ్ గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనంలో పేర్కొంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు ఆ కథనంలో వెల్లడించింది. శిక్ష అమలు వార్తలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాకపోవడం గమనార్హం.

జులై-ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో కొన్నిరోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వరదలు (Floods) సంభవించి అనేక ఊర్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో స్వయంగా కిమ్‌ రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించిన దృశ్యాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *