Uppal|లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ సత్తా చాటాలి

లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.మల్కాజిగిరి పార్లమెంటులో మరో సారి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో డివిజన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు.

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్​ సీటు అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్​ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ పరమేశ్వర్ రెడ్డి ,బొంతు శ్రీదేవి  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ సీతారాం రెడ్డి  ,అంజి రెడ్డి  ,చెర్లపల్లి డివిజన్ అధ్యక్షులు సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,యాదగిరి  ,నాగిళ్ల బల్ రెడ్డి  ,సత్తి రెడ్డి  ,పెద్ది నాగరాజ్  ,గోపాల్ యాదవ్ ,ఆనంద్ గౌడ్ ,బోడిగా ప్రభాకర్ గౌడ్ ,ప్రభాకర్ రెడ్డి ,శ్రీకాంత్ ,శ్రవణ్ కుమార్ గౌడ్ లింగం నాయక్ ,ముస్తాక్ ,వెంకటేష్ గౌడ్ ,ఖదీర్ ,శివ గౌడ్ ,క్రాంతి ,హీరాలాల్ నాయక్ ,వీరన్న నాయక్ ,శివకుమార్ గౌడ్ ,యాదగిరి గౌడ్ ,పాల్గొన్నారు

Share post:

లేటెస్ట్