Raj Tarun : ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు ప్లీజ్.. ‘భలే ఉన్నాడే’ ప్రెస్​మీట్​లో రాజ్ తరుణ్

ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల ఎక్కువగా లైమ్ లైట్​లో కనిపిస్తున్నాడు. దానికి కారణం.. ఒకటి ఆయన వరుస సినిమాలు రిలీజ్ అవుతుండటం. ఇంకొకటి మాజీ లవర్ లావణ్య కాంట్రవర్సీ. ఇక ఇప్పుడిప్పుడే ఆ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అతను నటించిన లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

శివసాయి వర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్​కు జోడీగా మనీషా నటిస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇందులో నుంచి రిలీజ్ అయిన సోనియా, చేసేది చీరల బేరం అనే పాటలు విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాయి.

మరో పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాజ్ తరుణ్.. ఇటీవల తాను ఎదుర్కొన్న కాంట్రవర్సీలోకి మళ్లీ లాగొద్దని రాజ్‌ తరుణ్‌ కోరారు. అలాగే భలే ఉన్నాడే సినిమా కుటుంబకథా చిత్రమని దర్శకుడు, ఇందులో అన్ని భావోద్వేగాలు ఉన్నాయని తెలిపారు.

భలే ఉన్నాడేలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

రాజ్‌ తరుణ్‌: ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. రొటీన్‌గా చేస్తుంటే బోర్‌ కొడుతుంది. ఇందులో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది.

రెండు నెలల నుంచి ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు?

రాజ్‌ తరుణ్‌: రెండు నెలల్లో ఇది నా మూడో సినిమా. ప్లాన్ చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే.

ఇటీవల జరిగిన కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చినట్లున్నారు?

రాజ్‌ తరుణ్‌:  ఆ కాంట్రవర్సీలోకి మళ్లీ నన్ను లాగొద్దు. గతంలో నేను నటించిన సినిమాలు సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తాను.

మీ కాంట్రవర్సీ సెడెన్‌గా ఆగిపోయింది. ఏం చేశారు?

రాజ్‌ తరుణ్‌: నేనేం చేయలేదండి.

వరుసగా సినిమాలు చేస్తున్నారు కాబట్టే.. లావణ్య ఇష్యూతో ప్రమోట్‌ చేసుకున్నారా?

రాజ్‌ తరుణ్‌: మీ క్వశ్చన్ జీర్ణించుకోవాలంటే కూడా టైమ్‌ పట్టేలా ఉంది. అలా ఎవరైనా ప్రచారం చేసుకుంటారా?

రాజ్‌ తరుణ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా?

డైరెక్టర్ శివసాయి: ఛాన్సేలేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు.

 

 

Share post:

లేటెస్ట్