HBD NAGARJUNA :  కింగ్ బర్త్ డే స్పెషల్.. ‘కూలీ’, ‘కుబేర’ సినిమాల నుంచి నాగార్జున లుక్స్ రిలీజ్

ManaEnadu:టాలీవుడ్ మన్మథుడు, కింగ్, అక్కినేని నాగార్జున (HBD Nagarjuna) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తాజాగా నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాల నుంచి ఆయన పాత్రకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తూ నాగ్ ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర చిత్రం నుంచి, లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagarajan) డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాల నుంచి నాగార్జున లుక్ ను రిలీజ్ చేశారు.

కూలీలో సైమన్ గా నాగార్జున

లోకేశ్ కనగరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంబోలో ‘కూలీ’ (Coolie) సినిమా వస్తున్న విషయం తెలిసిందే.  సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌లో నటిస్తున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆ మూవీలో నాగార్జున లుక్ రివీల్ చేసింది. నాగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విషెస్ చెబుతూ కూలీ నుంచి నాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఈ మూవీలో అక్కినేని నాగార్జున సైమన్ (Simon in Coolie) అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ లో కనిపిస్తోంది. ఇందులో తలైవా రజినీకాంత్ తో ఫైట్ చేసే విలన్ పాత్రలో నాగ్ నటించనున్నట్లు సమాచారం. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతోంది. 

కుబేర నుంచి నాగ్ న్యూ లుక్

త‌మిళ న‌టుడు ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘కుబేర’ సినిమాలో టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ కుబేర (Kubera Movie) టీమ్ మూవీ నుంచి నాగార్జున కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న ధనుశ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. 

Share post:

లేటెస్ట్