Bigg Boss 8: హౌస్‌లోకి కంటెస్టెంట్స్.. ఇక రచ్చరచ్చే!

Mana Enadu: BIG BOSS తెలుగు 8వ సీజన్‍ మొదలైంది. ఈ రియాల్టీ షో నయా సీజన్ గ్రాండ్ లాంచ్ అయింది. హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) 14 మంది కంటెస్టెంట్లు హౌస్‍లోకి పంపించారు. అయితే, ఈ సీజన్‍లో కంటెస్టెంట్లను జోడీలుగా పంపారు. ఇలా ఏడు జంటలు ఉన్నాయి. గ్రాండ్ లాంచ్‍లో కంటెస్టెంట్ల ఏవీ ప్రదర్శించారు. హౌస్‌లోకి వెళ్లేవారితో మాట్లాడిన నాగార్జున హౌస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి వారిని హౌస్‍లోకి పంపారు. మొత్తానికి తొలిరోజు ఈవెంట్ ఫుల్ ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‍గా సాగింది. ఈవెంట్‍కు గెస్టులుగా సరిపోదా శనివారం ప్రమోషన్ల కోసం నేచులర్ స్టాన్ నాని(Nani), హీరోయిన్ ప్రియాంకా మోహన్ వచ్చారు. అలాగే, ‘35 ఇది చిన్న కథ కాదు’ మూవీ కోసం ఆ మూవీని సమర్పిస్తున్న దగ్గుబాటి రానా(Rana Daggubati), ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ వెళ్లారు. హౌస్‍లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదా టాస్కులు ఆడించారు. చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) హౌస్‍లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‍బాస్ 8వ సీజన్ స్టార్ మా(Star Maa) ఛానల్‍లో ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ OTTలోనూ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది.

బిగ్‍బాస్ 8 తెలుగు 14 మంది కంటెస్టెంట్లు వీరే
1. యష్మీ గౌడ – TV సీరియల్ నటి
2. నిఖిల్ మలియక్కల్ – TV సీరియల్ నటుడు
3. అభయ్ నవీన్ – సినీ నటుడు
4. ప్రేరణ – TV సీరియల్ నటి
5. ఆదిత్య ఓం – సినీ నటుడు
6. సోనియా ఆకుల – సినీ నటి
7. బెజవాడ బేబక్క – Youtuber
8. ఆర్జే శేఖర్ బాషా – RJ
9. కిర్రాక్ సీత – సినీ నటి
10. నాగ మణికంఠ – TV సీరియల్ నటుడు
11. పృథ్వీరాజ్ – నటుడు
12. విష్ణుప్రియ భీమినేని – TV యాంకర్
13. నైనిక – డ్యాన్స్ – ఢీ ఫేమ్
14. నబీల్ ఆఫ్రీది – Youtuber

హౌస్‌లోకి ఏడు జోడీలు ఎంట్రీ

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ హౌస్‍‍లోకి జోడీలుగా కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. ఆట కూడా ఇలానే ఆడే అవకాశం ఉంది. 14 మంది హౌస్‍మేట్స్.. ఏడు జంటలుగా ఉన్నారు. 1. యష్మీ గౌడ – నిఖిల్, 2.అభయ్ నవీన్ – ప్రేరణ, 3.ఆదిత్య ఓం – సోనియా, 4.బెజవాడ బేబక్క – ఆర్జే శేఖర్ బాషా, 5.కిర్రాక్ సీత – నాగ మణికంఠ, 6.పృథ్వీరాజ్ – విష్ణుప్రియ , 7.నైనిక – నబీల్ ఆఫ్రిది జోడీలుగా ఉన్నారు. ఇప్పటికి 14 మంది హౌస్‍లోకి వెళ్లగా.. కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొందరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *