ManaEnadu:మెగా ఫ్యామిలీ(Mega Family)లో బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాలంలో జాయింట్ కుటుంబం అంటే దాదాపు చాలా మందికి తెలియదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బతుకుతున్నారు. ఇలాంటి టైంలో కుటుంబాన్నంతా ఒక్కటిగా ఉంచడం, ఇంకా కలిసి బతకడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది అన్నదమ్ములు, చెల్లెళ్లు ఇలా అందరూ ఇంకా ఒకేతాటిపైనే ఉంటున్నారంటే అందుకు ముఖ్యకారణం మెగాస్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi). తమ్ముళ్లపై చిరూ ఎనలేని ఆప్యాయత చూపితే.. అన్నపై నాగబాబు(Nagababu), పవన్(Pawan Kalyan) చాలా గౌరవం చూపిస్తుంటారు. అంతేకాదు సేవ కార్యక్రమాల్లోనూ ఈ ముగ్గురూ తమదైన శైలిలో హెల్ప్(Helping Nature) చేస్తుంటారు. నేడు మెగా ఇంటి వారసుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(Birth Day). ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి పవన్‌కు ప్రేమాప్యాయలతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు. అటు నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా పవన్‌కు పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలిపారు.
అది నువ్వు మాత్రమే చేయగలవు: చిరంజీవి
‘‘కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు(Leader) వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయా(Politics)ల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరి(Andhra People)కీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!’’ అంటూ లవ్ ఎమోజీ జత చేసి, గతంలో భార్య సురేక, తమ్ముడు పవన్ కలిసి దిగిన ఫొటోను ట్యాగ్ చేసి ట్విటర్(Twitter) వేదికగా పవన్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్(B’Day Wishes) తెలిపారు.
తమ్ముడి విజయం తన విజయంగా..
కాగా పవన్ ఏపీ అసెంబ్లీ(Ap Assembly) ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవడం, ఆయన పార్టీ జనసేన అభ్యర్థులు అందరూ విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు(Celebrations) భారీగానే చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. రామ్‌చరణ్- ఉపాసన, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తదితరులందరూ పవన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి. పవన్, అన్నాలెజినోవా, అకీరా గుమ్మడికాయతో దిష్టితీశారు. పవన్ కుటుంబీకులు ఆయనను లోపలికి ఆహ్వానించారు. లోపలికి వచ్చిన పవన్ కళ్యాణ్ తల్లి అజనాదేవి అన్నయ్య చిరంజీవి, కోడలు కాళ్లకు నమస్కరించారు. వెంటనే చిరంజీవి తన తమ్ముడిని ఆలింగనం చేసుకున్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ..
ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన అన్నయ్య చిరంజీవిపై ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వేదికపై ఉన్న PM నరేంద్ర మోదీ, CM చంద్రబాబు, రజనీకాంత్ , చిరంజీవి సహా ఇతర పెద్దలకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్ తిరిగి వస్తూ.. తన అన్నయ్య వద్ద ఆగి ఆయన పాదాలపై పడ్డారు. కింద ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న చిరంజీవి సతీమణి సురేఖ, ఆయన తనయుడు రాంచరణ్ ఈ దృశ్యం చూసి భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ దగ్గరకి వెళ్లిన పవన్ కళ్యాణ్ చిరంజీవి వైపు చూపెడుతూ చెవిలో ఏదో చెప్పారు. తర్వాత మోదీని తీసుకుని తన అన్నయ్య వద్దకు వెళ్లి పరిచయం చేశారు. అనంతరం మోదీ.. చిరు, పవన్‌ల చేతులు పట్టుకుని మరీ వేదిక మధ్యలోకి తీసుకొచ్చారు. తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మెగా బ్రదర్స్(Mega Brothers) ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు. పవన్ బుగ్గలు నిమురుతూ ఆప్యాయత చూపారు.