Megastar Chiranjeevi: ఇందుకే చిరంజీవి ‘అందరివాడు’.. అభిమానిని సత్కరించిన మెగాస్టార్

Mana Enadu: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొని పోయే గుణం. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు మెగాస్టార్. జీవితంలో జయాపజయాలు కామన్. అందుకే విజయం వస్తే ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే కుంగిపోవడం ఆయనకు తెలీదు. అయితే కష్టపడితేనే విజయం వరిస్తుందని నమ్మిన వ్యక్తి చిరు. ఎప్పుడూ తన సినిమాతో అభిమానులను అలరించేందుకు తాపత్రయపడుతూనే ఉంటారు. నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ మెగా హీరో.. వ్యక్తిగాను ‘అందరివాడు’ అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. బ్లడ్ బ్యాంక్​తో పాటు ఎన్నో చారిటబుల్​ ట్రస్ట్​ల ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎంతో సాయం చేశారు. ఇంకా సేవను కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా చిరంజీవి తన అభిమాని పట్ల ప్రేమాగుణం చాటుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న ఈశ్వరయ్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ విషయం కాస్తా చిరంజీవి చెవిలో పడటంతో అదే రోజు ఈశ్వరయ్యని తిరుమలలో కలిశారు. అంతేకాదు ఓ సారి తనను హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి కలవాలని కోరారు. అన్నట్లుగానే ఈశ్వ‌రయ్యను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు మెగాస్టార్. వారి కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని ఈ మెగా హీరో హామీ ఇచ్చారు.

అయ్యప్పమాల ధరించిన చిరంజీవి

కాగా గతంలోనూ ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి చిరంజీవి ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజుతో పాటు ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలని కూడా అనేక సార్లు ఆయన పొర్లు దండాలు పెట్టారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి సోమవారం అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *