Mana Enadu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్ ఉంది. ఏదో తెలియని ఎనర్జీ కనిపిస్తుంది. ఇక PK ఫ్యాన్స్ అయితే.. పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతి మూవీకి సూపర్ కలెక్షన్స్ అందిస్తుంటారు అభిమానులు. దీంతో ఇండస్ట్రీ(Industry)లో పవన్‌కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. మరోవైపు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్(Box Office) షేక్ అవాల్సింది. నయా రికార్డులు సృష్టించాల్సిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే(Birth Day). దీంతో ఆయన తన వచ్చే సినిమాలపై అప్‌డేట్(Updates) ఇస్తారని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు చిత్రాల నుంచి అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, రావాల్సిన అన్ని అప్‍డేట్లు క్యాన్సల్(Cancle) అయైనట్లు తెలుస్తోంది. ఇందుకు రీజన్ ఎంటో తెలుసుకుందామా..
ఎలాంటి అప్‌డేట్లు వద్దన్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(AP Deputy CM, జనసేన అధ్యక్షుడు, స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు (SEP 2) తన 56వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ఈ సెలబ్రేషన్ల(Celebrations)కు అభిమానులు రెడీ అయ్యారు. మరోవైపు గబ్బర్ సింగ్ చిత్రం మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, పవన్ కల్యాణ్ హీరోగా లైనప్‍లో ఉన్న OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, అవన్నీ క్యాన్సల్ అయ్యాయి. AP, Telanganaలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల జనం ఆశ్రయం కోల్పోయారు. దీంతో తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఎలాంటి సినిమా అప్‍డేట్లు ఇవ్వొద్దని మూవీ టీమ్‍లకు పవన్ కల్యాణ్ సూచించారని సమాచారం.
వర్షాలు.. వరదలు కలిసిగట్టుగా అధిగమిద్దాం..
అయితే పపన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ నుంచి కంటెంట్ ఏమీ రాదని ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న DVV ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడించింది. OG సినిమాను కొన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకుంటామని పేర్కొంది. “AP, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద విలయాల కారణంగా రేపు బర్త్‌డే కంటెంట్ రిలీజ్‍ను రద్దు చేస్తున్నాం. రానున్న చాలా సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకునేలా OG సినిమా ఉంటుంది. దీన్ని కలిసికట్టుగా అధిగమిద్దాం. త్వరలో భారీగా సెలబ్రేట్ చేసుకుందా” అని DVV ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఆదివారం ట్వీట్ చేసింది. కాగా వచ్చే ఏడాది March 27న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా..
పవన్ కల్యాణ్ పుట్టిన రోజున హరిహర వీరమల్లు నుంచి ఓ పోస్టర్(Poster) తీసుకొద్దామని అనుకున్నామని, కానీ రద్దు చేస్తున్నట్టు ఈ మూవీ టీమ్ వెల్లడించింది. “పవర్ ఫ్యాన్స్ కోసం ఓ ఎగ్జైటింగ్ పోస్టర్ తీసుకొద్దామని మేం ప్లాన్ చేశాం. ప్రస్తుతం ఉన్న తీవ్రమైన వరదల పరిస్థితుల్లో ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం” అని మెగా సూర్య ప్రొడక్షన్స్ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమాకు తొలుత క్రిష్(Krish) దర్శకత్వం వహించగా.. ఇటీవలే ఆయన తప్పుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ దర్శకత్వ బాధ్యతలు ఇప్పుడు ఏఎం జ్యోతికృష్ణ చేతుల్లో ఉన్నాయి. హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకుడిగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి కూడా పవన్ కల్యాణ్ పుట్టిన రోజున స్పెషల్ పోస్టర్ తెచ్చేందుకు మేకర్స్ ముందుగా నిర్ణయించి ఇప్పుడు రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.