Viswam:నేనిక్కడుండటానికి కారణం మోసం’.. నవ్వులు పూయిస్తున్న గోపీచంద్ ‘విశ్వం’ టీజర్

ManaEnadu:టాలీవుడ్ నటుడు గోపీచంద్ (Gopichand) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కామెడీ, ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శ్రీను వైట్ల(Sreenu Vaitla)తో కలిసి గోపీచంద్ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పేరే విశ్వం (Viswam). Gopichand 32గా వస్తోన్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.

తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో హీరోయిన్ చెప్పే సంభాషణలతో మొదలైంది టీజర్‌. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం.. హీ ఈజ్ మై బర్నింగ్ ఎమోషన్’ అంటూ గోపీచంద్ (Gopichand Viswam) చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడిన వారిని హీరో చితక్కొట్టడం ఈ టీజర్‌లో చూడొచ్చు. ఇక ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండటానికి కారణం.. మోసం, తప్పుల్లో ఐదో స్థానంలో ఉండటానికి కారణం..మోసం, నేనిక్కడ ఉండటానికి కారణం మోసం అంటూ చెప్పిన డైలాగ్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇక ఈ టీజర్‌లో గోపీచంద్ ఫైట్స్ కూడా చూడొచ్చు. మొత్తానికి సూపర్ హిట్ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమైపోతోంది. టీజర్‌లో నరేశ్ (Actor Naresh), ప్రగతి, వెన్నెల కిశోర్‌తోపాటు షకలక శంకర్‌, అజయ్ ఘోష్‌ కాంబోలో తమ కామింగ్ టైమింగ్‌తో అదరగొట్టారు. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి రూపొందిస్తున్నారు. గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *