ManaEnadu:మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman).. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ కంపోజర్. చేతినిండా ప్రాజెక్టులున్నా ఎప్పుడు చిల్‌గా కనిపిస్తాడు. ఓవైపు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ.. మరోవైపు తన ట్రూప్‌తో విదేశాల్లో కన్సర్ట్లు నిర్వహిస్తూ.. ఇంకోవైపు ఇండియన్ ఐడల్ తెలుగు (Indian Idol Telugu) వంటి రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇలా బిజీ షెడ్యూల్లోనూ చాలా జాయ్‌ఫుల్‌గా కనిపిస్తాడు తమన్. ఇక తమన్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దడిబిదిబిడి అంటూ మాస్ బీట్ వాయించాలన్నా.. సూథింగ్ సాంగ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయాలన్నా తమన్‌కు చేతితో కొట్టిన పిండి.
అందుకే ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా ప్రాజెక్టులతో ప్రస్తుతం తమన్ బిజీబిజీగా ఉన్నాడు. ఓవైపు రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్.. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలు చేస్తున్నాడు. పవర్ స్టార్ ఓజీ (OG Movie) సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మ్యూజిక్ బాధ్యతలు నిర్వహిస్తున్న తమన్‌పై మరీ ఎక్కువ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తమన్ ఓజీ గురించి ఓ క్రేజీ న్యూస్ చెప్పాడు.
ఇండియన్ ఐడల్ లేటెస్ట్ ప్రోమో..
ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ, డిఫరెంట్ వోకల్స్ ఉన్న సింగర్స్‌తో పాటలు పాడించడం తమన్‌కు అలవాటు. అందుకే తాజాగా ఓజీ సినిమా కోసం తాను జడ్జిగా వ్యవహరిస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్-3 నుంచి ఇద్దరు బెస్ట్ సింగర్స్‌ను సెలెక్ట్ చేసి ఈ చిత్రంలో ఓ పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా తానే చెప్పాడు. తాజాగా ఇండియన్ ఐడల్ తెలుగు వినాయక చవితి స్పెషల్ (Vinayaka Chaviti) ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది.
ఓజీలో పాడే ఛాన్స్..
రేస్ టూ ఫినాలే అంటూ మొదలైన ఈ ప్రోమోలో ఫైనల్‌కు చేరుకోబోయే కంటెస్టెంట్లు పాటలు పాడి ఆకట్టుకున్నారు. అయితే ఇందులో కంటెస్టెంట్ భరత్ (Indian Idol Contestant Bharat) మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రంలోని ‘తరలిరాద తనే వసంతం’ అనే పాటను పాడాడు. భరత్ పాడిన తీరును మెచ్చుకుంటూ తమన్.. ఓ క్రేజీ న్యూస్ చెప్పాడు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో భరత్‌తో పాటు మరో కంటెస్టెంట్ నజీర్ (Nazeer) ఓ పాట పాడారాన్ని తెలిపాడు. ఆ పాట రికార్డింగ్ పూర్తయిందని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ పాట విని చాలా బాగుందని చెప్పారని వెల్లడించాడు.
తమన్ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారి ఇండియన్ ఐడల్ సెట్లో సందడి మొదలైంది. నజీర్, భరత్‌లకు జడ్జిలతో పాటు ఇతర కంటెస్టెంట్లు, హోస్టు శ్రీరామచంద్ర కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా తమకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తమన్‌కు నజీర్, భరత్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తమన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యంగ్ టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు ఛాన్స్ ఇస్తున్న తమన్ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక భరత్, నజీర్‌లు ఇండియన్ ఐడల్ 3 సీజన్ ప్రారంభం నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.






