ManaEnadu:దర్శకుడు పూరీ జగన్నాథ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వచ్చిన మరో సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart Movie). ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పార్ట్-1 మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటూ రామ్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే క్యారెక్టర్లో అలరించాడు. చాక్లెట్ బాయ్ రామ్‌ను ఓ రేంజ్ మాస్ అవతార్‌లో పూరీ చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇస్మార్ట్ శంకర్‌కు వచ్చిన క్రేజ్ చూసి దానికి సీక్వెల్ రూపొందించాలని ఫిక్స్ అయిన పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇటీవలే డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి పార్ట్లాగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
https://twitter.com/newottupdates/status/1831420688164679836
మూవీ విడుదలై కనీసం నెల రోజులు కూడా కాకముందే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలో (Double iSmart OTT)కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ నటించింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో సంజయ్ దత్ (Sanjay Dutt), సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రల్లో అలరించారు.
డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ఏంటంటే?: విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు బిగ్ బుల్ (సంజయ్‌దత్). ఇండియాను ముక్కలు చేయాలనుకునే అతని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ వేతుకుతూ ఉంటుంది. ఇంతలో బిగ్‌బుల్ మెదడులో కణితి ఉందని, కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో మరో వందేళ్ల ప్రణాళికలతో బతుకుతున్న బిగ్ బుల్ తాను చనిపోకూడదని, ఎలాగైనా బతకాలని ఫిక్స్ అవుతాడు.
ఎలా బతకాలని మార్గాల కోసం అన్వేషించినప్పుడు మెదడులో చిప్ పెట్టుకుని హైదరాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్కడు ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలుస్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్‌లో పేస్ట్ చేయడంతో. మరి ఇస్మార్ట్ శంకర్‌లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది? అతని సొంత జ్ఞాపకాలు, అతని ప్రేమ, లక్ష్యాలు ఏమయ్యాయి? అన్నదే ఈ సినిమా స్టోరీ.