‘దేవర’ నుంచి ‘దావూదీ’ సాంగ్ రిలీజ్ – డ్యాన్స్ ఇరగదీసిన ఎన్టీఆర్, జాన్వీ

ManaEnadu:పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1 (Devara Part-1)’. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబరు 27వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ వంటి భారీ హిట్ తర్వాత తారక్ నటించిన సినిమా కావడం వల్ల ‘దేవర’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఇటీవలే విడుదలైన చుట్టమల్లే పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ (Janhvi Kapoor) కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

దేవర పార్ట్-1 నుంచి తాజాగా మూడో పాట రిలీజైంది. ‘దావూదీ (Daavudi Song)’ అనే పాటను మూవీ మేకర్స్ ఇవాళ (సెప్టెంబరు 4వతేదీ 2024) విడుదల చేశారు. ప్రముఖ లిరిసిస్ట్​ రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాయగా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటను సింగర్స్​ నకాశ్ నజీజ్, ఆకసా పాడారు. ఈ పాటలో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ (NTR Janhvi) డ్యాన్స్ అదరగొట్టేశారు. ఫుల్ ఎనర్జీతో ఎప్పటిలాగే ఎన్టీఆర్ స్టెప్పులు ఇరగదీసేశాడు. ఇక ఈ పాటలో జాన్వీ అందాలు మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram), మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

Share post:

లేటెస్ట్