NBK 50 Years: బాలకృష్ణ 50 ఏళ్ల సర్ణోత్సవం.. అందరూ ఆహ్వానితులే!

Mana Enadu: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ (Golden jubilee) సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్వర్ణోత్సవ వేడుకలు పేరిట అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా వేడుక నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్లో అతిరథ మహారథుల సమక్షంలో నటసింహ బాలయ్యను సన్మానించనున్నారు. సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి శ్రేయాస్ మీడియా(Shreyaas Media) సమక్షంలో ఈ ఈవెంట్ జరగనుంది. బాలయ్య సర్ణోత్సవ కార్యక్రామానికి ఇప్పటికే ఎంతోమందికి ఇన్విటేషన్ అందించారు. అయితే కొందరికి ఆహ్వానం అందలేదన్న దానిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది.

అన్నివర్గాల మద్దతు లభించింది: దామోదర ప్రసాద్

ఈ సందర్భంగా నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ మాట్లాడారు. ‘సెప్టెంబర్ 1న బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్(Celebrations) గ్రాండ్‌గా జరుగుతాయి. అన్ని విభాగాల నటీనటుల, సాంకేతిక నిపుణుల నుంచి ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున మద్దతు లభించింది. అయితే కొందరికే ఈ ఈవెంట్‌కు ఇన్విటేషన్లు అందాయని వార్తలు రావడం బాధాకరం. ఇప్పటికే అన్ని యూనియన్ల ద్వారా ప్రతి ఒక్కరికీ పీడీఎఫ్ రూపంలో ఆహ్వానం పంపించాం. ఒకవేళ ఇన్విటేషన్ రాకపోతయినా.. తెలుగు చిత్ర పరిశ్రమను కుటుంబంలా భావించి అందరూ రావాలి’ అని కోరారు.

స్పాన్సర్ కిరణ్ మాట్లాడుతూ.. ‘‘బాలక‌ృష్ణ 50 ఏళ్ల వేడుకలో భాగం కావడం మా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తాం. ఒక మంచి వ్యక్తికి ఇలాంటి సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం’ అని అన్నారు. కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని శాఖలు కలిసి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిని అంతా కలిసి విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలక‌ృష్ణ, శివ బాలాజీ, సుచిర్ ఇండియా కిరణ్, చదలవాడ శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, మాదాల రవి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

 ప్రత్యేక ఇన్విటేషన్ కార్డు

కాగా, నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఓ ప్రత్యేక ఇన్విటేషన్ కార్డు(Invitation Card)ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన సినీ ప్రస్థానం వివరాలను ఈ కార్డులో పొందుపరిచారు. 1974 నుంచి 2024 వరకూ బాలయ్య తన కెరీర్‌లో 109 సినిమాలు చేసినట్లు తెలిపారు. ఆయన సినిమాలు రూ.10 లక్షల నుంచి రూ.250 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టాయని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనకు.. ఫ్యాన్స్ 10 ఫీట్ల నుంచి 108 ఫీట్ల కటౌట్స్ పెట్టారని అన్నారు. అలాగే, ఆయన సినిమాలు 100 నుంచి 1000 రోజులు అడిన రికార్డు క్రియేట్ చేశాయని.. అటు సినిమాల్లోనూ, ఇటు పాలిటిక్స్‌లోనూ రాణించారని ఇన్విటేషన్‌లో పేర్కొన్నారు.

Related Posts

Saiyaara: ‘ఆషికీ 2’ తర్వాత మళ్లీ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘సయారా’ ట్రైలర్ వైరల్..

బాలీవుడ్‌లో ప్రేమకథలు కొత్తేమీ కాదు. కానీ ప్రతి తరం ప్రేక్షకుడిని టచ్ చేసేలా కొన్ని కథలు మనసులో మిగిలిపోతాయి. ఇక అర్థాంతరంగా ముగిసిన ప్రేమకథలకూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. అలాంటి క్రమంలోనే దర్శకుడు మోహిత్ సూరి(Mohith Suri), ప్రముఖ…

OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *