Kaveri:ప్రేక్షకులు మనస్సు గెలిచిన “కావేరి” మూవీ.. సక్సెస్ మీట్లో దర్శక నిర్మాతలు

ManaEnadu:రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కావేరి”.(Kaveri) స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు(Shaik Allabakashu) నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం(Rajesh Nellore) వహించారు. ఆగస్టు 30న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబకషు మాట్లాడుతూ.. “ఆగస్టు 30న విడుదలైన మా కావేరి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఇది మంచి ఎమోషనల్ మరియు ఇన్స్పిరేషనల్ మూవీ అన్నారు. ఇటువంటి చిత్రం నిర్మించడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారని తెలిపారు. మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలని చూపించిన విధానం బాగుందని కొనియాడుతున్నారని వివరించారు. ఈ సినిమాని ఇంతలా ప్రమోట్ చేసి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన పీఆర్ఓ వెంకటేష్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో ‘చెన్నై బజార్’ అనే మంచి కమర్షియల్ సినిమా మా బ్యానర్ నుంచి రాబోతుందని ప్రకటించారు.

డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ.. ” ఈ సినిమా మొదలు కావడానికి ప్రధాన కారణం మా కెమెరామ్యాన్ నాగేంద్ర బన్నీ. అతని సపోర్ట్ తో ఈ మూవీ ఇక్కడివరకు వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి సినిమా చేయగలమని నిరూపించిన చిత్రంగా పేర్కొన్నారు.

హీరో ఫైజల్ మాట్లాడుతూ. సినిమా చూసి థియేటర్ నుంచి ఎమోషనల్ గా బయటకు వచ్చామని నాకు ఎందరో మెసేజ్ లు చేశారన్నారు. అలాగే సినిమాలో మేము అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయిందన్నారు. అన్ని చోట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి సంతోషంగా ఉందన్నారు అన్నారు.

డైరెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. స్యాబ్(SAB) అంటే షేక్ అల్లాబకషు. తన పేరునే బ్యానర్ గా పెట్టి, వరుసగామూడు సినిమాలు చేస్తున్నారని చెప్పారు. ముందుగా ‘చెన్నై బజార్’ మొదలుపెట్టి, ఆ తర్వాత ‘కావేరి’ చేసి, ఇప్పుడు ‘మాస్ గాడు’ చేస్తున్నారని తెలిపారు. ఆడవారికి ఎంతో సహనం ఉంటుంది. ఆ సహనం నశిస్తే ఆదిపరాశక్తిని చూస్తామన్నారు. అదే పాయింట్ తో దర్శకుడు రాజేష్ ‘కావేరి’ కథను సిద్ధం చేసుకున్నారని తెలిపారు.

నటీనటులు : రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్, లక్ష్మి ప్రియా, గుజ్జల సుధీర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు, తదితరులు పాల్గొన్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *