Vijay The GOAT : ట్యూన్ కంపోజ్ చేసిన రోజే సింగర్ మృతి.. ఏఐ సాయంతో సాంగ్ రెడీ

ManaEnadu:రజినీ కాంత్ లాల్ సలామ్ సినిమాలో ఓ పాటలో దివంగత సింగర్ షాహుల్ హమీద్‌ వాయిస్‌తో ఓ పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఆ పాటను రూపొందించారు. ఇప్పుడు ఇదే టెక్నాలజీని తమిళ నటుడు దళపతి విజయ్ నటిస్తున్న తన కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time) చిత్రంలోనూ వినియోగించారు. ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) చెప్పారు. అయితే ఈ పాటను ఏఐ సాయంతో రూపొందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

” ‘ది గోట్ (Vijay The GOAT)’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్న యువన్ శంకర్ రాజా ‘‘ఓ రోజు ‘చిన్న చిన్న కంగళ్‌’ సాంగ్‌ థీమ్‌ (Chinna Chinna Kangal Theme Song) గురించి నాకు చెప్పారు. ఆ పాటను ఆయన సోదరి, గాయని భవతారణి (Bhavatharini)తో పాడించాలని డిసైడ్ అయ్యాం. అనుకున్నట్లుగానే మొదట ట్యూన్ కంపోజ్ చేశాం. అనారోగ్యంతో ఉన్న భవతారణి ట్యూన్ కంపోజింగ్ అయిన తర్వాత చెన్నైకి వచ్చి సాంగ్ పాడతారని అనుకున్నాం. కానీ ట్యూన్ కంపోజింగ్ పూర్తయిన రోజే ఆమె మరణించారు.

లాల్ సలామ్‌ (Lal Salam)లో ఏఐ సాయంతో పాట పాడించినట్లు మేము కూడా అలా ట్రై చేయాలనుకున్నాం. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్‌ను అడిగి తెలుసుకుని.. ఆ తర్వాత భవతారణి రా వాయిస్ తీసుకుని మరో సింగర్ ప్రియదర్శిని హెల్ప్‌తో ఏఐ టెక్నాలజీ వినియోగించి ఈ పాటను రూపొందించాం. ఔట్ పుట్ బాగా రావడం.. ట్యూన్ నచ్చడంతో ఈ పాటకు మెయిల్ వాయిస్ తాను పాడతానని హీరో విజయ్ (Thalapathy Vijay) ముందుకొచ్చాడు. అలా విజయ్, భవతారణిల గొంతుతో ‘చిన్న చిన్న కంగళ్‌ సాంగ్‌ను రెడీ చేశాం.” అని వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు. ఇక విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘ది గోట్‌’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share post:

లేటెస్ట్