Mana Enadu:మ్యాన్ ఆఫ్ మాసెస్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) శనివారం రోజున కర్ణాటకలో పర్యటించిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో కలిసి తల్లి పుట్టిన ఊరులో పలు దేవాలయాలను సందర్శించారు. నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashant Neel) తో కలిసి కన్నడనాటి ప్రముఖ ఆలయాలను సందర్శించిన ఎన్టీఆర్ ఇందులో భాగంగా కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే దేవాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ కన్నడ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి (Rishab Sheety)తో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉందని తెలిపారు. అయితే పలువురు విలేకర్లు తన సినిమాలు గురించి పలు ప్రశ్నలు అడగ్గా.. ఆలయంలో సినిమా అప్‌డేట్‌లపై స్పందించాలని లేదని సున్నితంగా తిరస్కరించారు. దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
అయినా వినకుండా ఓ విలేకరి.. ‘‘కాంతార’ ప్రీక్వెల్ (Kantara Prequel)లో మీరు యాక్ట్ చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో గత కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఆవార్తల్లో నిజమెంత?’’ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సంయమనం కోల్పోకుండా నవ్వుతూ ‘‘రిషబ్ శెట్టే అది ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
రిషబ్‌శెట్టి హీరోగా.. ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం ‘కాంతార (kantara Movie)’. 2022లో చిన్న సినిమాగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్లతో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డు (Rishab Sheety National Award) అందుకున్నారు.
ఇక ప్రస్తుతం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ కు రిషబ్ రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ తొలి భాగం ఉండనున్నట్లు సమాచారం. దీనికోసం రిషబ్ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాంతారు ప్రీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.