Bigg Boss 8 : ఈ సారి ‘నో సోలో ఎంట్రీ’.. హౌజులోకి నాని, నివేదా, రానా.. ఇంట్రెస్టింగ్ గా లేటెస్ట్ ప్రోమో

ManaEnadu:ఎప్పుడెప్పుడా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం మరికొద్ది గంటల్లో రాబోతోంది. రియాల్టీ షోస్ కా బాప్ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Bigg Boss Telugu 8 Grand Launch) ఇవాళ్టి (సెప్టెంబరు 1వతేదీ) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు రిలీజ్ అయి ఈ సీజన్ పై ప్రేక్షకులకు అంచనాలు పెంచేశాయి. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవాళ్టి నుంచి బిగ్ బాస్ 8 తెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా లాంఛింగ్ ప్రోమో (Bigg Boss Telugu 8 Promo Latest) విడుదలైంది.  ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జున (Nagarjuna) ఈ సీజన్‌కూ హోస్ట్‌గా చేస్తున్నారు. ‘‘ఈ సీజన్‌ లిమిట్‌లెస్‌’’ అని అంటూ ఈ ప్రోమోలో ఆయన ఎంట్రీ అదిరిపోయింది. ఇక కంటెస్టెంటులను పరిచయం చేస్తూనే వారి ముఖాలను మాత్రం ఈ ప్రోమోలో చూపించలేదు.

ఇక ఓ కంటెస్టెంట్ ను ఆయన స్వాగతించిన తర్వాత సదరు కంటెస్టెంటును హౌజులోకి పంపిస్తూ.. ఈసారి హౌస్‌లోకి సోలో ఎంట్రీలు (No Solo Entry In Bigg Boss Telugu 8) ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు నాగార్జున. అలా.. కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి జోడీలుగా పంపించారు. ఇక ఈ ప్రోగ్రామ్ ప్రారంభ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు. ‘సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)’ ప్రమోషన్స్‌లో భాగంగా నాని – ప్రియాంక ఈ షోలో సందడి చేశారు.

మరోవైపు ‘35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)’ ప్రమోషన్స్‌ కోసం రానా, నివేదా థామస్‌ ఈ షోకు వచ్చారు. వీరంతా బిగ్ బాస్ హౌజులోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదాగా కాసేపు గడిపారు. ఇక ప్రోమో చివరలో దర్శకుడు అనిల్‌ రావిపూడి (Director Anil Ravipudi) వచ్చి హౌజులో కాసేపు సందడి చేసి చివరలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. ప్రోమోలోనే ఈ రేంజ్ ట్విస్టు ఉందంటే ఈ సీజన్ లో మరెన్ని ట్విస్టులు ఉండబోతున్నాయోనని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఈ సీజన్. కంటెస్టెంట్స్‌ ఎవరు..? ఎంతమంది పాల్గొననున్నారు? వివరాలు ఇవాళ్టి లాంఛింగ్ ఎపిసోడ్ లో తెలిసిపోనున్నాయి.

Share post:

లేటెస్ట్