Mana Eenadu: ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో షాక్, మిపరపకాయ్ సినిమాలు రవితేజ, హరీశ్ కాంబోలో వచ్చినవే. మరోవైపు మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా భాగ్యశ్రీ బోర్సే(BhagyaSri Borse) తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు(Jagapathi babu) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రీమియర్ షోలు ఆగస్టు 14న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
సిద్ధంగా ఉండండి..
ఇదిలా ఉండగా సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజులే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను సూపర్ ఫాస్ట్‌గా నిర్వహిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్(Pre Release) ఈవెంట్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఆగస్టు 12న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో ఉన్న STBC కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6:00 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇదే విషయాన్ని ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది మూవీ టీమ్. పోస్టర్‌లో మాస్ మహారాజ రవితేజ స్టైల్ అండ్ స్వాగ్ అదుర్స్ అని చెప్పాలి. వింటేజ్ మాస్ మహారాజాను ఈ చిత్రంలో చూడబోతున్నట్లు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
1980’s బ్యాక్‍డ్రాప్‍లో
1980’s బ్యాక్‍డ్రాప్‍లో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కింది. పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‍పై జరిపిన ఐటీ దాడుల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో ఇన్‍కమ్ ట్యాక్స్ శాఖ అధికారిగా రవితేజ నటించారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్లో “ఇండియన్ ఆర్మీ ఎంత పవర్‌ఫుల్లో.. ఇన్‍కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా అంతే పవర్‌ఫుల్ అని నిరూపిస్తా” అని రవితేజ డైలాగ్ ఉంది. ముఖ్యంగా రవితేజ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్ అదిరిపోయాయి. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






