Mana Enadu: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రేంజే వేరు. ఆయన రావడంతోనే ఈ స్థాయి దక్కలేదు. చిన్న చిరు జల్లులా వచ్చి తుఫాన్‌లాగా మారారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పద్మవిభూషన్ స్థాయికి ఎదిగారు. సినీ ఫీల్డ్‌లో ఆయన చూడని కష్టం లేదు. ఆయన పడని బాధాలేదు. ఆయన ‘స్వయం కృషి’తో ఎదిగిన నటుడు.. ‘విజేత’గా నిలిచిన ఓ స్టాలిన్. అలాంటి హీరోతో ఒక్క అవకాశం దొరికినా చాలు అనుకునే వారు చాలా మంది నటీమణులు. అప్పట్లో పదేళ్ల పిల్లోడి నుంచీ పండు ముసలి వరకూ ఆయన ఫ్యాన్సే. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న హీరో.. అప్పుట్లో డాన్స్‌లో మెగాస్టార్ మించిన వారు లేరు. 1978లో పునాదిరాళ్లు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఈ స్టార్.. ఇండస్ట్రీలో డజన్లకొద్దీ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం చిరూ సినిమాలకు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి..
అందకే నటించలేదు..
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. రాధా, రాధికా, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ లాంటి హీరోయిన్లు చిరంజీవితో జతకట్టారు. అయితే అప్పట్లో అయితే కొందరు హీరోయిన్లతో చిరూతో కాంబినేషన్ కుదర్లేదట. అలాంటి హీరోయిన్లలో సీనియర్ నటి గౌతమి కూడా ఒకరు. అప్పట్లో గౌతమి కూడా సౌత్‌లో ప్రముఖ హీరోయిన్‌గా రాణించారు. తెలుగులో ఆమె నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించారు. అయితే చిరంజీవితో కలిసి నటించలేకపోయానని గౌతమి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
‘చిరు’కి వివరిస్తా..
చిరంజీవితో నటించకపోవడం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు చిరూతో మూడు సినిమాల్లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ప్రతిసారి వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదర్లేదని గౌతమి చెప్పింది. ఆ సమయంలో నేను రజనీకాంత్ సినిమాకి ఆల్రెడీ కమిటై ఉన్నాను. నేను ఒకసారి సైన్ చేస్తే ఎలాంటి సమస్య అయినా ఎదురుకానీ.. ఆ చిత్రం పూర్తి చేసి తీరుతాను. రజనీకాంత్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాలకు సైన్ చేయడం వల్ల చిరంజీవితో ఆఫర్స్ మిస్ అయ్యాయి. ఎప్పుడైనా చిరూని కలిసినప్పుడు ఆయనకి వివరణ ఇస్తా అంటూ గౌతమి అన్నారు ఈ సీనియర్ నటి గౌతమి.