చేతి గీతల్లో కాదు..చేసే పనులను బట్టి సారంగపాణి జాతంకం..షూటింగ్​ పూర్తి రిలీజ్​ అప్పుడే 

ManaEnadu: ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohan Krishna Indraganati), శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సారంగపాణి జాతకం'(Sarangapani Jathakam). ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న సారంగపాణి మూవీ షూటింగ్​ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్​ తెలిపింది. 

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”ఇటీవల ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఉంటుందన్నారు. 

ఇప్పటికే  చిత్రీకరణ పూర్తయిందని యూనిట్​ వెల్లడించింది. రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేశామన్నారు. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించినున్నట్లు చెప్పారు.  ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేదన్నారు. మా సంస్థలో జంధ్యాల  డైరెక్షన్ లో  ఓ సినిమా చేయాలని అనుకున్నాం అన్నారు. 

యన  మా సంస్థలో రెండు విజయవంతమైన చిత్రాలు ‘చిన్నోడు – పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలకు డైలాగ్స్ రాశారు కానీ, సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు ఇన్నేళ్లకు  భర్తీ అయ్యింది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఖర్చు పరంగానూ, టెక్నికల్ పరంగానూ  ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం ” అని చెప్పారు.

తారాగణం:
ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్.

సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి ఉన్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *