Devara Trailer : ‘దేవర’ ట్రైలర్ అప్డేట్.. వర, దేవర ఇద్దరూ వస్తున్నారు!

ManaEnadu: ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేసారు. రేపు సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ అప్డేట్ ఇస్తూ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు. ఒక ఎన్టీఆర్ ముందుకు చూస్తుంటే మరో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాను నుండి రక్తం కారుతోంది. అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతాలు దేవర, వర రాబోతున్నారు అని తెలిపింది.

Share post:

లేటెస్ట్