Ka:”క” థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న స్టార్ హీరో

ManaEnadu:యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbaaram)నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. “క” సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టినీ ఆకర్షిస్తోంది.

తాజాగా “క”(Ka Movie) సినిమా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మలయాళంలో “క” సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. “క” సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. స్ట్రాంగ్ కంటెంట్ తో “క” సినిమా ఈ క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది.

“క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *