Mana Enadu: రెబల్ స్టార్ కృష్ణంరాజు(KRishnam Raju) నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు హీరో ప్రభాస్(Prabhas). 2002లో ఈశ్వర్ మూవీతో నటించిన తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్ పేట్ ఈశ్వర్(Eeshwar) పాత్రలో యంగ్ రెబల్ స్టార్ మాస్ లుక్‌లో దుమ్ములేపాడు. ఆ తర్వాత తన సినీ కెరీర్‌లో ప్రభాస్ వెనక్కి తిరిగి చూడలేదు. వర్షం, ఛత్రపతి మూవీలు ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెదరని ముద్రవేశాయి.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభాస్ ఒకప్పటి హీరో కాదు. పాన్ ఇండియా హీరో. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ కెరీర్‌లో హైలైట్. సాహో(Sahoo), సలార్(Salaar)తన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకుళ్లాయి. ఇటీవల విడుదలైన కల్కి సూపర్ హిట్‌గా నిలిచింది.. ఇప్పటికే ఈ మూవీ థియేటర్లలో 50రోజులు కంప్లీట్ చేసుకుంది.
వరుస సినిమాలతో బిజీ..
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మారుతీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హారర్, కామెడీ, రొమాంటిక్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిథిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
వేగంగా షూటింగ్
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ రాజాసాబ్‌పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభాస్‌పై కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీపై డైరెక్టర్ మారుతీ, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాజాసాబ్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…