Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’.. టిక్కు టిక్కు సాంగ్ సూపర్బ్​

ManaEnadu:అప్సరా రాణి (Apsara Rani), విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘రాచరికం’ (Racharikam). చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. ‘రాచరికం’కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ఆ పోస్టర్లలో అప్సరా రాణి కనిపించిన తీరు సినిమాపై భారీగా క్రేజ్ పెంచేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘టిక్కు టిక్కు’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ స్పెషల్ ఏమిటంటే..

‘టిక్కు టిక్కు’ అంటూ సాగిన ఈ హుషారైన పాటను ప్రముఖ రచయిత పెంచల్ దాస్ (Penchaldas) రాశారు. ఈ పాట రాయడమే కాకుండా సింగర్ మంగ్లీతో కలిసి ఆయనే ఆలపించారు. సంగీత దర్శకుడు వెంగి ఇచ్చిన ఈ బాణీ ఎంతో హుషారుగా అనిపిస్తూ, వినగానే కిక్కిచ్చేలా ఉంది. పర్‌ఫెక్ట్ జాతర సాంగ్‌లా ఎంతో రిచ్‌గా పాటను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. పోలంకి విజయ్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరపై విజువల్ ఫీస్ట్‌గా కనిపించేలా ఉంది. (Tikku Tikku Lyrical Song From Racharikam)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *