ManaEnadu:ఆగస్టు నెల చివరి వారం వచ్చేసింది. ఇక ఈ వారాంతంలో సినిమా ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి పెద్ద సినిమాలు.. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వీటిలో పెద్ద సినిమాల కంటే.. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. ప్రేక్షకులు ఈ చిన్న సిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ నెల చివరి వారంలోనూ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీపైన ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో పాటు ఇంకా ఏమేం సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..?
థియేటర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే..
సరిపోదా శనివారం – నాని, ప్రియాంకా మోహన్ నటించిన ఈ సినిమాను వివేక్ అత్రేయ తెరకెక్కించారు. ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది.
అహో! విక్రమార్క – దేవ్ గిల్ ప్రధాన పాత్రలో త్రికోటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది.
మాస్ – నాగార్జున నటించిన ఈ సినిమా ఆయన పుట్టిన రోజు కానుకగా ఈనెల 28, 29న రీ రిలీజ్ కాబోతోంది.
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్
ఐసీ814:ది కాంధార్ హైజాక్ ఆగస్టు 29
ది డెలివరెన్స్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30
బ్రీత్‌లెస్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్
నో గైన్ నో లవ్ ది (కొరియన్ సిరీస్) ఆగస్టు 26
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ 2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 29
డిస్నీ+హాట్‌స్టార్
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 4 (వెబ్‌సిరీస్) ఆగస్టు 27
కానా కానూమ్ కాళంగల్ (తమిళ్ సిరీస్) ఆగస్టు 30
జియో సినిమా
ఎబిగైల్ (హాలీవుడ్) ఆగస్టు 26
గాడ్డిల్లా వర్సెస్ కాంగ్ (హాలీవుడ్) ఆగస్టు 29
జీ5
ముర్షిద్ (హిందీ సిరీస్) ఆగస్టు 30
యాపిల్ టీవీ ప్లస్
కె-పాప్ ఐడల్స్ (కొరియన్) ఆగస్టు 30
బుక్ మై షో
ట్విస్టర్స్ (హాలీవుడ్) ఆగస్టు 30






