ManaEnadu:టాలీవుడ్లో నేచురల్ స్టార్ (Actor Nani) నాని తన సహజమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఏ సినిమా చేసినా పక్కింటి అబ్బాయి వైబ్ కనిపిస్తుంది. టాలీవుడ్లో వెంకటేశ్ తర్వాత యంగ్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఉన్న నటుడు నానియే. దసరా సినిమాలో మాస్ అవతార్‌తో యాక్షన్‌తో అదరగొట్టిన నాని.. ఆ తర్వాత హాయ్ నాన్నతో కుటుంబ ప్రేక్షకుల చేతి కన్నీళ్లు పెట్టించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్ల జోష్ మీదున్న నాని తాజాగా ‘సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అంటే సుందరానికి (Ante Sundaraniki) ఫేం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ ఇవాళ (ఆగస్టు 29వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో నాని, ఎస్జే సూర్య సీన్స్ చిత్రానికే హైలైట్‌గా నిలిచాయని ఆడియన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ కొట్టాడని రివ్యూలు వస్తున్నాయి.
ఇక థియేటర్లో ఇలా రిలీజ్ కాగానే.. ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుంది అని నెటిజన్లు సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ‘సరిపోదా శనివారం’ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా టైటిల్ కార్డులో అఫీషియల్‌గా ఈ విషయాన్ని రివీల్ చేశారు. భారీ మొత్తంలో నగదు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా రైట్స్ పొందిందట.
‘సరిపోదా శనివారం’ థియేటర్లలోకి వచ్చిన (ఆగస్ట్ 29) నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. అలా చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు అగ్రీమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అంటే అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా పండుగకు కుటుంబంతో కలిసి మరోసారి చూడొచ్చన్నమాట. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) బ్యానర్‌పై దానయ్య నిర్మించగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.