Realme Note 60: మొబైల్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్

Mana Enadu: రోజులు మారుతున్నాయ్.. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా అరచేతిలో ప్రపంచం చూపించే మొబైల్ ఫోన్లు ఎంత స్మార్ట్‌గా, ఎన్ని ఎక్కువ ఫీచర్లు ఉన్నదే ఇంపార్టెంట్ అంటారు ఈ తరం యూత్. ధనవంతులు తమ రేంజ్‌కి సరితూగే ఫోన్లను ఎంచుకుంటే మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజానీకం ఉన్నంతలోనే ది బెస్ట్ అనుకునే ఫోన్లవైపు చూస్తుంటారు. ముఖ్యంగా యువత స్మార్ట్ యుగంవైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది 5G ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యారు. మరికొందరు పాత ఫోన్ వదిలేసి కొత్త ఫోన్లు కొనేందుకు ఆలోచిస్తుంటారు. అందుకు తగ్గట్లే కొత్త కొత్త మోడల్స్‌ను కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ Realme note 60 5G పేరుతో ఓ కొత్త మోడల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఆగస్టు 30న దీనిని మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్ ఫీచర్లు ఏంటి? ధర ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం పదండీ..

 ఫీచర్లు ఇవే..

రోజుకో కొత్త రకం స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయడంలో చైనా కంపెనీలు ముందుటాయి. తాజాగా ఆ దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. రియల్ మీ నోట్ 60 పేరుతో ఇండియా మార్కెట్లోకి దీనిని పరిచయం చేస్తోంది. గతేడాది తీసుకొచ్చిన Realme note50కి కొనసాగింపుగా రియల్‌మీ నోట్‌60 ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
ఆగస్టు 30వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. రియల్‌మీ నోట్‌ 60 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ టెక్నాలజీని అందించారు. దీనిని OS Android 13.0 వెర్షన్‌తో రూపొందించారు.

64 మెగాపిక్సెల్‌ కెమెరా

ఈ స్మార్ట్ ఫోన్‌లో క్యాప్సూల్‌ 2.0 ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌ వంటి పవర్‌ఫుల్‌ వంటి బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64MP కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌ను 4GB ర్యామ్ విత్ 64GB స్టోరేజీ, 6GBర్యామ్ విత్ 128GB స్టోరేజీ, 8 GB ర్యామ్ విత్ 256GB స్టోరేజీ వంటి మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌లో IP64 రేటెడ్‌ కూడిన డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ 7.84 ఎమ్‌ ఎమ్‌ వెడల్పు, 187 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఎక్స్‌పెక్టెట్ ధర రూ.19,990గా ఉండొచ్చని మార్కెట్ వర్గాల టాక్.

Related Posts

ఈ గ్రామంలో ఇల్లు ధర కేవలం రూ.100.. అసలు కారణం ఏంటి?

ఫ్రాన్స్‌లోని పూయ్-డీ-డోమ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న పట్టణం అంబర్ట్ (Ambert) స్థానిక జనాభా తగ్గిపోతుండటంతో నూతన నివాసితులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, అక్కడి పురాతన ఇళ్లు కేవలం 1 యూరో (రూ.100)కి అమ్మకానికి పెడుతున్నారు.…

మద్యం ప్రేమికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మద్యం ప్రియులకు(Liquor Lovers) శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో చిన్న స్థాయిలో బీర్(Bear) తయారీ కేంద్రాలైన మైక్రో బ్రూవరీ(Microbreweries)లను స్థాపించేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తెలిపింది. ప్రతి 5 కి.మీ.కు ఒక మైక్రో బ్రూవరీ అనుమతి!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *