Wynk:యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్​టెల్.. ‘వింక్​ మ్యూజిక్’​ యాప్​కు గుడ్​బై

ManaEnadu:టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel).. తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్సేవలకు ఈ సంస్థ గుడ్ బై చెప్పింది. యూజర్లకు మెరుగైన సేవలను అందించేందు ఈ సంస్థ టెక్​ దిగ్గజం యాపిల్​తో​ భాగస్వామ్యం (Apple Airtel Partnership) అయినట్లు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వింక్ మ్యూజిక్ సేవలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఎయిర్​టెల్ యూజర్లకు వింక్ మ్యూజిక్ (Wynk Music)  సేవలు ఫ్రీగా అందుతున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ఆ సౌకర్యమే కాకుండా అసలు ఆ యాప్​నే మూసివేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో వింక్ మ్యూజిక్ యాప్​ మూసివేయనున్నారు. యాప్​ను మూసేసిన తర్వాత అందులోని ఉద్యోగులను ఎయిర్​టెల్​లోకి తీసుకు రానున్నారు. 

ఇప్పటికే వింక్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ (Wynk Premium Subscription)​ తీసుకున్నవారు కొందరు ఉన్న విషయం తెలిసిందే. వారి కోసం ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ఆఫర్‌ తీసుకురాబోతోందట. ఎయిర్‌టెల్‌ యూజర్లు ఇక నుంచి యాపిల్‌ మ్యూజిక్‌ ద్వారా మ్యూజిక్ వినొచ్చు. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయని పీటీఐ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ కంపెనీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. త్వరలోనే వింక్‌ మ్యూజిక్‌కు నిలిపివేయనున్నామని తెలిపారు. దీంతో Wynk మ్యూజిక్‌లోని ఉద్యోగులను ఎయిర్‌టెల్‌లో సర్దుబాటుచేయనున్నట్లు చెప్పారు.

యాపిల్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్‌ ఐఫోన్‌ వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉండనున్నాయి. ఎయిర్​టెల్​ కస్టమర్ల (Airtel Customers)కు రాబోయే రోజుల్లో యాపిల్‌ టీవీ+, యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ను యాక్సెస్​ను అందించే అవకాశమున్నట్లు ఎయిర్​టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమృత్‌ త్రిపాఠి తెలిపారు. ఈ సర్వీసులు ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. యాపిల్ మ్యూజిక్ (iMusic) యాప్ ఫీచర్లో ఉండే యాపిల్ మ్యూజిక్ సింగ్, టైమ్-సింక్డ్ లిరిక్స్, లాస్‌లెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో కంటెంట్​ను ఇకపై ఎయిర్​టెల్ యూజర్లు పొందచ్చొన్నమాట.

 

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *