Mana Enadu: కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇటీవల రూ.200లోపు రెండు రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో.. తాజాగా మరో ఆఫర్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ తాజా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ కొన్ని సెలక్టెడ్ కంట్రీస్‌కు మాత్రమే వర్తించనుంది. ఇందులో యూఏఈ, కెనడా, థాయిలాండ్, సౌదీ అరేబియా, ఐరోపా, కరేబియన్‌లోని అనేక దేశాలతో సహా పాపులర్ టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. రిలయన్స్ జియో కొత్త ఐఆర్ ప్యాక్‌లు కరేబియన్‌లోని 24 దేశాలు, 32 యూరోపియన్ దేశాలలో విస్తరించాయని ఆ సంస్థ తాజాగా తెలిపింది. ఈ కొత్త IR ప్యాక్‌తో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్, SMS, అవుట్‌గోయింగ్ కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సందర్శించిన వారు దేశంలో లోకల్ కాల్‌లు, భారత్‌కు కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇన్‌కమింగ్ కాల్‌లను ఏ దేశం నుంచి అయినా రిసీవ్ చేసుకోవచ్చు. అలాంటి కాల్‌లకు Wi-Fi కాలింగూ చేసుకునే అవకావం కల్పించింది.

* జియో UAE ఆఫర్ ప్లాన్లు ఇవే..
☛ ఎంట్రీ-లెవల్ ప్యాక్ ధర రూ. 898, 100 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్ (లోకల్, భారత్‌కు తిరిగి వచ్చే కాల్స్)
☛100 నిమిషాల ఇన్‌కమింగ్ కాల్‌లు, 1జీబీ డేటా,
☛ 100 ఎస్ఎంఎస్‌లను ఏడు రోజుల వ్యాలిడిటీ
☛ రూ.1,598 ప్యాక్‌తో 150 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్, 3జీబీ డేటా, 14 రోజుల వ్యాలిడిటీ
☛ రూ. 2,998 ధర ప్రీమియం ఆప్షన్, 250 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్‌లు, 7జీబీ డేటా, 21 రోజుల వ్యాలిడిటీ.
☛ సౌదీ అరేబియాలో రూ.891తో 100 నిమిషాల కాల్స్, 1జీబీ డేటా, 20 ఎస్ఎంఎస్, 7 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
* కెనడాలోని జియో యూజర్లకు ఇలా..
☛ రూ.2,891 ప్లాన్ 150 నిమిషాల కాల్స్, 5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, 30 రోజుల వ్యాలిడిటీ.
☛ రూ.1,691 ప్యాక్ కింద 100 నిమిషాల కాల్స్, 5జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్, 14-రోజుల వ్యాలిడిటీ.
☛ రూ. 2,881తో 150 నిమిషాల కాల్‌లు, 10జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, 30తోను రోజు వ్యాలిడిటీ.
* థాయ్‌లాండ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం
☛ రూ.1,551 ప్యాక్‌తో 100 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ చేసుకునే అవకాశం.
☛ రూ.2,851తో 14 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటా, 50SMS లేదా 150 నిమిషాల కాల్‌లు, 12GB డేటా, 100SMS వంటివి ఉన్నాయి. మరోవైపు యూరప్, కరేబియన్ కోసమూ కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్న ప్లాన్లను జియో తీసుకొచ్చింది.







