శుక్రవారం తెల్లవారుజామున కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతివేగంతోనే ప్రమాదం జరిగిందనే కారణాలను పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ORR రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఎగ్జిట్ నెంబరు 4 సమీపంలో ప్రమాదం జరిగింది. సుమారు 100మీటర్లు మేర లాస్యనందిత కారు ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ఢికొట్టిందని భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత లారీ ఆగకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు విచారణలో బయటపడింది.
ప్రమాదంలో లాస్య తలకు బలమైన తీవ్రగాయాలు కావడంతోనే అక్కడక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ముందు సీట్లో పీఏ కూర్చున్నట్లు తెలుస్తుంది. బెలూన్లు ఓపెన్ అయ్యాయని పోలీసులు గుర్తించారు.
గన్‌మెన్ ప్రయాణ సమయంలో ఉండి ఉంటే ముందు సీట్లో కూర్చుని వేగాన్ని నియంత్రించడంతోపాటు ముందు వెళ్తున్న వాహనాలను గుర్తించే అవకాశం ఉండేది. గన్‌మెన్ ఉంటే లాస్యనందింత కారుకు ప్రమాదం జరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు.