Mana Enadu: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి రజతం అందించాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇదే తొలి రజత పతకం కావడం గమనార్హం. మరోవైపు గత ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్.. ఈసారి కూడా గోల్డ్ తీసుకొస్తారని అందరూ భావించారు.. కానీ ఈసారి సిల్వర్ మెడల్‌తో వచ్చాడు. అయినా వరుసగా ఒలింపిక్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఫైనల్‌లో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. రజతం సాధించిన తర్వాత నీరజ్ మాట్లాడుతూ.. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని.. అయితే, తన ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని అన్నాడు. పారిస్‌లో భారత జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉందని.. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.
ఇద ఈ బల్లెం వీరుడికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. “నీరజ్ చోప్రా నువ్వో అద్భతం. నీ ప్రతిభను మళ్లీ నిరూపించావు. మరో ఒలింపిక్ మెడల్ సాధించి భారత్‌ను గర్వించేలా చేశావు. సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. భవిష్యత్‌లో రాబోయే అథ్లెట్లు తమ కలలను నెరవేర్చు కోవడానికి, అలానే భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.