ManaEnadu:స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎప్పుడెప్పుడు హాలీడేస్ వస్తాయా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆదివారం (Sunday) ఒక్క రోజు సెలవు వస్తే పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ వరుసగా రెండు, మూడు రోజులు హాలిడేస్ వస్తే మాత్రం ఎగిరి గంతేస్తారు. అందుకే విద్యార్థుల కోసం ఓ సూపర్ గుడ్ న్యూస్. అదేంటంటే.. సెప్టెంబరు నెలలో భారీగా సెలవులు (September Holidays) వస్తున్నాయి. పండుగలు, ఇతర పర్వదినాలు, ఆదివారం కలుపుకుని సెలవులే సెలవులు ఈనెలలో. మరి ఏయే రోజుల్లో హాలిడేస్ వస్తున్నాయో ఓసారి చూద్దామా..?
సెప్టెంబర్ నెల అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎంతో ఇష్టమైన వినాయక చవితి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi) ఫేవరెట్. వినాయక చవితి, నిమజ్జనం ఉత్సవాల్లో అంతా కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ జరుపుకొంటారు. సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పండగ 7వ తేదీన శనివారం రోజున వస్తోంది. మరుసటి రోజు సెప్టెంబర్ 8వ తేదీన ఆదివారం. ఇలా వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఇక సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం. కాబట్టి స్కూల్స్ కు హాలిడే. ఆ తర్వాత సండే మరో హాలిడే. ఇక 16వ తేదీ సోమవారం రోజున మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (Milad Un Nabi) (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) పండుగ సందర్భంగా మరో సెలవు. ఇలా స్కూల్స్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ నెలలో దాదాపు 8 రోజులు స్కూల్స్ (School Holidays) కు సెలవులు వస్తున్నాయి.
సెప్టెంబర్‌లో పాఠశాలలకు హాలిడేస్ ఉండే రోజులు ఇవే..
సెప్టెంబర్ 1 (ఆదివారం)
సెప్టెంబర్ 7 (శనివారం): వినాయక చవితి
సెప్టెంబర్ 8 (ఆదివారం)
సెప్టెంబర్ 14 (రెండో శనివారం)
సెప్టెంబర్ 15 (ఆదివారం)
సెప్టెంబర్ 16 (సోమవారం) : మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)
సెప్టెంబర్ 22 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 29 (ఆదివారం)