Mana Enadu: జై బోలో గణేష్ మహరాజ్‌కీ.. జై(Jai bolo ganesh Maharaj)! గణపతి బప్పా మోరియా (Ganapathi Bappaa moriyaa).. అని నినదించేందుకు జై వినాయక.. విఘ్ను వినాయక ప్రథమ గణాధి నాయక.. భక్తి శ్రద్ధలతో కొలిచేమంటూ భక్తులు వినాయకుడి ఉత్సవాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పల్లెలు, పట్టణాలలో వీధులన్నీ ఆ లంబోదరుడి మండపాలతో ముస్తాబయ్యాయి. అటు ఆయా మండపాలకు గణనాథుడూ విచ్చేశాడు. మరికొందరు విగ్రహాల తయారీ ప్రాంగణాల నుంచి గణనాథులను మండపాలకు తరలిస్తున్నారు. డీసీఎంలు, లారీలు, ట్రాలీల్లో గణనాథులను గ్రామాలు, పట్టణాల్లోని వీధులకు తీసుకెళ్తున్నారు. ఈసారి రకరకాల ప్రతిమల్లో స్వామివారి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు విఘ్నేశ్వరుడి విగ్రహాలు, మరోవైపు పండుగ సామగ్రి విక్రయాలతో మార్కెట్లు సందడిగా మారాయి. అటు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు పోలీస్‌శాఖ ఇలా ఒక్కొక్కటిగా ఈ సారి గణేశ్ ఉత్సవాలకు సిద్ధమయ్యాయి.
తొలిపూజ చేయనున్న సీఎం, గవర్నర్
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు(Khairathabad Ganesh). తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు(70 Years) పూర్తవుతుండటంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సప్తముఖ మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ భారీ గణేషుడికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు వాడవాడలా వెలిసే గణేశ్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలి: CM చంద్రబాబు
మరోవైపు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు నా శుభాకాంక్షలు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. వాడవాడలు చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయి. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలూ ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నాను. విఘ్నాలను అధిగమించి… రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు.
ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలి: కేసీఆర్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు BRS అధినేత, మాజీ సీఎం KCR శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు.






