రేషన్‌ కార్డు దారులకు వారం రోజులే గడవు.. ఈ-కేవైసీ ఉంటేనే పథకాలు

రేషన్‌ కార్డులకు మరో వారం రోజుల గడవు మాత్రమే మిగిలింది. ఈనెల 29నాటికి రేషన్​ కార్డులు ఈ కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈకేవైసీ చేసిన లబ్దిదారులకు మాత్రమే సంక్షేమ పథకాలు రానున్నట్లు తెలిపింది.

90 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు తెలంగాణలో ఉన్నాయి.60శాతానికి పైగానే ఇంకా ఈకేవైసీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని అధికారులు గణంకాలు వెల్లడిస్తున్నారు. ఈ-కేవైసీ గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. రేషన్​ కార్డులకు ఈకేవైసీ చేస్తేనే మార్చి నుంచి రేషన్​ బియ్యం అందుతాయని పౌరసరాఫరాల శాఖ వెల్లడిస్తుంది. లేదంటే రేషన బియ్యం, ఇతర పథకాలు నిలిచిపోనున్నాయి.రేషన్‌కార్డులో ఉన్న సభ్యులు తమ వివరాలను రేషన్ డీలర్లను వద్ద నమోదు చేసి.. ధృవీకరించాలి. కానీ ఇప్పటికీ చాలా మంది ఇంకా చేయలేదు. ఫిబ్రవరి 29తో గడువు ముగుస్తుంది. ఇంకా వారం రోజులే సమయం ఉండడంతో.. ఇప్పటికీ రేషన్ కార్డుల ఈ కేవైసీ పూర్తి చేయవని వారు.. వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మళ్లీ పొడిగించేది లేదు..ఇదే ఆఖరి గడవు

మరోసారి గడువును పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు. ఫిబ్రవరి 29లోగా చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ జనవరి 31తో ముగియాల్సి ఉంది. కానీ తెలంగాణ, ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డులను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచింది కేంద్రం. తెలంగాణలో ఇప్పటి వరకు రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ 85 శాతం మేర పూర్తయినట్లు తెలుస్తోంది . ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌.. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీచేశారు. రేషన్‌కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈకేవైసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లటం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటంతో.. వాటిని ప్రక్షాళన చేస్తోంది. రేషన్ కార్డులో పేర్లున్న వారంతా.. తమ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వారి పేర్లను రేషన్ కార్డుల్లో కొనసాగిస్తారు. లేదంటే తొలగిస్తారు.

Share post:

లేటెస్ట్