తెలంగాణ ప్రజలకు చల్లని వార్త..పగలంతా ఎండవేడి, ఉక్కపోత ఉంటే,.. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది. ఇలాంటి టైమ్‌లో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది..
రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించబోతున్నాయి.. నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి జల్లులుతో పాటు మోస్తారుగా వర్షాలు కురవనున్నాయి.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది..
అలాగే రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి.. అదే విధంగా హైదరాబాద్,నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది..
ఒకవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కూడా ప్రజలు సీజనల్ వ్యాధులు మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.. ఈ వర్షాలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, చిన్న పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోదక శక్తి పెరగడానికి పరిశుభ్రతను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..