రక్షాబంధన్ హార్ట్ టచింగ్ వీడియో.. తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు

ManaEnadu:దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటోంది. అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను కులమతాలకతీతంగా జరుపుకుంటారు. ఎంత దూరంలో ఉన్నా రక్షాబంధన్ రోజు తోబుట్టువులు పుట్టింటికి చేరి తమ సోదరులకు రాఖీ కడతారు. కొన్నిసార్లు తోబుట్టువులకు వెళ్లడం కుదరకపోతే.. కొంతమంది సోదరులే వాళ్ల వద్దకు వెళ్తారు. ఇక వేరే దేశాల్లో ఉండటం, వివిధ కారణాలతో వెళ్లలేని వారు.. తమ అన్నాదమ్ముళ్ల కోసం రాఖీలను ఇంటికి పంపిస్తుంటారు. 

ఇలాంటి అనుబంధాలకు వేదిక అయిన ఈ రాఖీ వేడుక సందర్భంగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మనసును కదిలించే ఓ దృశ్యం చోటుచేసుకుంది. రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. అయితే వారికి ఇవాళ సెలవు లేకపోవడంతో.. తన అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు జితేంద్ర తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్లాడు. అయితే హాస్టల్ లో ఉన్న తన అక్కల వద్దకు తనను వెళ్లనియకపోవడం.. వారిని కూడా బయటకు పంపకపోవడంతో ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. జితేంద్రనేమో తన అక్కలు రాఖీ కడితేనే అక్కడి నుంచి కదులుతానని భీష్మించుకు కూర్చొన్నాడు. దీంతో ఇక అతడి తండ్రి.. తన భుజంపై జితేంద్రను ఎక్కించుకుని తన కూతుళ్లు ఉన్న హస్టల్ గది కిటికీ వద్దకు వెళ్లాడు. అక్కడికి తన కుమార్తెలను పిలిచి.. కిటికీ నుంచే తన కుమారుడికి రాఖీ కట్టించాడు. అలా జితేంద్ర తన తండ్రి భుజంపై ఎక్కి కిటికీ లో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.

దీనికి సంబంధించి ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కాదమ్ముళ్ల బంధానికి ఫిదా అవుతున్నారు. ఇది కదా రాఖీపండుగకు అసలైన అర్థం అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. రాఖీ పండుగ రోజు కూడా తప్పకుండా సెలవు ఇవ్వాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. సెలవు ఇవ్వక్కర్లేదు బ్రదర్.. కనీసం రాఖీ కట్టేందుకు పర్మిషన్ అయినా ఇవ్వాల్సింది.. ఇవ్వేం స్కూల్స్.. ఇవేం రూల్స్ అంటూ ఇంకొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక మరో నెటిజన్.. ‘తెలంగాణ సంస్కృతిలో రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క సీతక్క-రేవంతన్నలే కాదు. ప్రతి అక్కకు, తమ్ముడికి అదొక ప్రత్యేక సందర్భం. అసలైతే రాఖీ కట్టడానికి వెళ్లాలనుకున్న పిల్లలకు సెలవు ఇవ్వాల్సింది పోయి అక్కలతో రాఖీ కట్టించుకోవాలని వచ్చిన ఈ చంటి పిల్లోడిని లోపలికి అనుమతించలేదట. ఏం రోగమో?’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు.

https://x.com/GhantaC/status/1825514178356097153?t=m6TkCwVcppTTC6ILbUo3pw&s=08

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *