Mana Enadu:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు హమీనిచ్చింది. ఈక్రమంలోనే రెండు విడతలకు లక్ష, లక్షన్నర రుణాల ఉన్నవారికి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జ చూసింది. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
మూడో విడత రుణమాఫీ అమలుపై రైతులతోపాటు ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందన్నారు.
ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని అన్నారు. రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు లెక్కలు చెప్పారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని అన్నారు. ఆగస్టు లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నాం అని భట్టి విక్రమార్క అన్నారు.






