ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబోలో లేటెస్ట్ గా వచ్చిన సినిమా ‘కల్కి ఏడీ 2898’. ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా 50 డేస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ సంధ్య థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సెలబ్రేషన్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యామిలీతోపాటు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అభిమానుల మధ్య సినిమా చూస్తూ కేరింతలు కొట్టారు. సగటు ప్రభాస్ ఫ్యాన్ లా చీటీలు ఎగరేస్తూ థియేటర్లో నానా హంగామా చేశారు. విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ.. అరుస్తూ థియేటర్లో సందడి చేశారు. సినిమా చూసిన తర్వాత థియేటర్ యాజమాన్యం ఆయన్ను శాలువాతో సత్కరించింది. అనంతరం అశ్విన్ భారీ కేక్ కట్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోలను ఫుల్ షేర్ చేస్తూ.. నువ్వూ మా వాడివే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అట్లుంటది మరి అన్నారు. సో స్వీట్ నాగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జూన్ 27న గ్రాండ్‌గా రిలీజైన కల్కి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1100కోట్లకుపైగా వసూల్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ నటులు తమ పర్ఫామెన్స్ తో మైమరిపించారు. ఇక ఆగస్టు 23 నుంచి కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు టాక్.






