Mana Enadu:చిన్న మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది హీరోయిన్ శ్రీలీల. అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్ సంపాదించుకుంది. తన డాన్సుతో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా స్టన్నింగ్ తన లుక్స్‌తో యువతను కిల్ చేస్తోందీ తెలుగమ్మాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా నుంచి వచ్చిన టాప్ మోడల్స్ కి సైతం శ్రీలీల బిగ్ కాంపిటీషన్ ఇస్తోంది.
సోషల్ మీడియాలోనూ..
సోషల్ మీడియాల్లో ఈ భామకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా శ్రీలీల హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. శ్రీలీల తెల్లటి పవర్ సూట్‌లో సంథింగ్ యూనిక్‌గా కనిపిస్తోంది. షైనీ అల్ట్రా గ్లామ్ బ్లేజర్‌లో ఎంతో అందంగా మెరిసిపోతోంది.
తాతయ్య వల్లే ఇండస్ట్రీలోకి..
ఇక తన సినీ కెరీర్ గురించి ఈ తెలుగమ్మాయి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘‘మా తాతయ్య వల్లే నేను సినిమాల్లో ఉన్నా. నటిగా రాణిస్తున్నా. ఎందుకంటే, మాది విద్యావంతుల కుటుంబం. మా ఫ్యామిలీలో ఇంజినీర్స్, డాక్టర్స్ ఎక్కువ. సినిమాల్లోకి వచ్చేందుకు తాతయ్య ప్రోత్సహం అందించారు. ఆయన వల్లే ఈ స్థ్థాయిలో ఉన్నా’’ అని శ్రీలీల చెప్పారు.
‘గుంటూరు కారం’తో అలరించిన శ్రీలీల ప్రస్తుతం తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’, ‘ఉస్తాద్ భగతసింగ్’, ‘రవితేజ 75’లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ కోసం ఆమె సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారని టాక్.