Mana Enadu:సరిగ్గా 28 ఏళ్ల కిందట విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్ నటన, శంకర్ టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా గురించి ఇప్పటికీ చర్చించుకుంటారంటే ఈ ఇద్దరి మార్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇటీవల కమల్ హాసన్ – శంకర్ ద్వయంయయ ‘భారతీయుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది.
అయితే భారతీయుడులో ప్రేక్షకులను ఫిదా చేసిన సేనాపతి పోరాటం పార్ట్-2లో మాత్రం అంతగా ఆకట్టుకోలేపోయింది. దీంతో ఈ సినిమాకు ఆదరణ తక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే సంస్థ ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి భారతీయుడు-2 స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
భారతీయుడు -2 స్టోరీ ఇదే : చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), ఆర్తి (ప్రియ భవానీ శంకర్) మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో సమాజంలో అవినీతి, అన్యాయాల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోరాడుతుంటారు. తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలని, అందుకు భారతీయుడు అలియాస్ సేనాపతి (కమల్‌హాసన్) రావాల్సిందేనని భావిస్తుంటారు ఈ ఫ్రెండ్స్. అలా నెమ్మదిగా సోషల్ మీడియాలో విప్లవం మొదలుపెడతారు. ఆ పిలుపు అందుకున్న సేనాపతి మొత్తానికి భారతదేశంలో అడుగుపెటతాడు. అయితే ఇన్నాళ్లూ ఆయన ఎక్కడున్నాడు? తిరిగొచ్చిన తర్వాత ఆయన సమాజంలో తప్పును సరిదిద్దేందుకు ఏం చేశాడు? ఆయన కోసం కాపు కాసిన సీబీఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహా) భారతీయుడిని అరెస్ట్ చేశాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.