Mana Enadu:పూరీ జగన్నాథ్.. ఈ పేరుకే టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు.. ముఖ్యంగా ఆయన హీరోలు.. వాళ్ల యాటిట్యూడ్‌కు మామూలు క్రేజ్ ఉండదు. డైరెక్షన్లో ఆయన రూటే సపరేటు. లోకల్ చంటిగాడు.. మైండ్ బ్లాక్ చేసే పండుగాడు ఈయన హీరోలే. ఒక్కో సినిమా ఒక్కో డైమండ్. ఈ మధ్య ఈయన సినిమాలు అంతగా ఆడకపోయినా.. పూరీ నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని తప్పకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్తారు.
హరీశ్ శంకర్.. టాలీవుడ్లో మాస్ డైరెక్టర్లలో ఈయన ఒకరు. డైరెక్షన్లో ఈయన కూడా కాస్త సపరేటు రూట్లోనే వెళ్తారు. కమర్షియల్ చిత్రాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. హరీశ్ శంకర్ పూరీ జగన్నాథ్‌ను తన గురువుగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ గురుశిష్యులు తమ కొత్త సినిమాలతో పోటీ పడుతున్నారు. మరి ఈ పోటీలో గెలుపెవరిది?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హరీశ్ శంకర్ డైరెక్షన్లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. లైగర్ ప్లాఫ్‌తో ఉన్న పూరీకి డబుల్ ఇస్మార్ట్ బెన్ఫిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రేంజ్ హైప్‌తో ఉండటంతో పూరీ ఖాతాలో హిట్ ఖాయమని టాక్.
మరోవైపు హరీశ్ శంకర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక మిస్టర్ బచ్చన్పైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతుండటంతో ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. పూరీ జగన్నాథ్, హరీశ్ శంకర్ ఇద్దరూ కమర్షియల్ డైరెక్టర్లే. ఇద్దరు సినిమాల్లో హీరోలు మాస్ ప్రేక్షకులకు ఫేవరెట్. ఇక హీరో క్యారెక్టరైజేషన్ దాదాపుగా ఇద్దరి సినిమాల్లో ఒకేలా ఉంటుంది. ఇక ఈ ఇరువురి మూవీస్‌లో డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్న రామ్.. మిస్టర్ బచ్చన్ అంటూ వస్తున్న రవితేజ.. ఎవరు తమ డైరెక్టర్‌ను గెలిపిస్తారో చూడాలంటే మరో వారం ఆగాలసిందే.