Mana Enadu:అక్కినేని వారింట మరోసారి పెళ్లిబాజా మోగనుంది. టాలీవుయ్ యంగ్ హీరో, అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య త్వరలో మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. నాగచైతన్య, టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఈరోజు ఉదయం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ జంట జీవితం సంతోషంతో నిండాలని నాగార్జున ఆకాంక్షించారు. ఈ కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత.. నాగచైతన్య కొంతకాలం సింగిల్గానే ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన శోభితతో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు మొదలయ్యాయి. వీటికి బలం చేకూర్చుతూ ఈ జంట విహార యాత్రలకు వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఈ జంట ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇవాళ్టి ఎంగేజ్మెంట్ నాగచైతన్య ఇంట్లో జరిగింది. ఈ వేడుకలో నాగార్జున కుటుంబంతో పాటు ధూళిపాళ ఫ్యామిలీకి సంబంధించిన వారు, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్టు సమాచారం.






