Thangalaan: ఆ మూవీలను ఢీకొట్టనున్న ‘‘తంగలాన్’’.. హిట్ కొట్టేనా?

Mana Enadu:విభిన్నమైన కంటెంట్ ఉన్న మూవీలు ట్రై చేయడంలో ముందుంటారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయనకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలతో ఆడియన్స్‌పే అలరిస్తుంటారు. ఆయన చివరగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీరోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ‘‘తంగలాన్’’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా.. టైల‌ర్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఇది సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

 ట్రైలర్‌ సూపర్..

ఇక ట్రైలర్‌లో ఓ ఆట‌విక తెగ‌కు చెందిన వ్య‌క్తిగా విక్ర‌మ్ చాలా వైవిధ్యంగా క‌నిపించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు చాలా బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా 35 కేజీలు తగ్గినట్లు టాక్. బంగారం కోసం అన్వేషిస్తుండ‌గా ఓ మాంత్రికురాలు అడ్డుప‌డ‌గా.. విక్ర‌మ్ ఆ మాంత్రికురాలిని ఎదుర్కొంటున్న‌ట్లుగా ట్రైల‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. ఇందుకోసం కోలీవుడ్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు భారతీయ సినీ రంగంలో ఏ చిత్ర పరిశ్రమ తీసుకోని ఆ నిర్ణయం కోలీవుడ్ ఇండస్ట్రీ తీసుకున్నట్లు సమాచారం. తంగలాన్‌ కాకుండా మరే ఇతర సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చెయ్యవద్దని కోలీవుడ్‌ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం హాట్‌టాపిక్‌గా మారింది.

కోలార్ బంగారు గనుల నేపథ్యంలో

కోలార్ బంగారు గనుల నేపథ్యంలో అక్కడ పని చేసే కార్మికుల ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు తంగలాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు తంగలాన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. విక్రమ్, మాళవికా మోహనన్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారని ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లతోనే తెలుస్తోంది. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల రాశి మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. అలాగే పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

 మరో వారం ఆగాల్సిందే..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హరీశ్ శంకర్ డైరెక్షన్​లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 15వ తేదీనే రిలీజ్ కాబోతున్నాయి. దీనికి ఇప్పుడు విక్రమ్ తంగలాన్ తోడవడంతో ఆగస్టు 15న స్ర్కీన్లు దద్దరిల్లనున్నాయి. మరి ఈ రెండు మాస్ సినిమాలను తంగలాన్ ఢీకొడుతుందా? ప్రేక్షకులకు ఈ మూడు సినిమాల్లో ఏది ఫుల్ ఎంటర్‌టైయిన్‌మెంట్ ఇస్తుందో? తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే..

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *