శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని వారి కాబోయే కోడలు గురించి ఈ విషయాలు తెలుసా?

Mana Enadu:అక్కినేని నాగచైతన్య రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ్లతో ఇవాళ ఉదయం ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వివాహం చేసుకుంటున్నారు. వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమంతతో విడాకుల అనంతరం వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా రోజులు నెట్టింట వైరల్​గా మారిన విషయం తెలిసిందే. కానీ వీళ్లిద్దరు ఎప్పుడు దానిపై మాట్లాడలేదు. ఇక ప్రస్తుతం ఎంగేజ్​మెంట్ ఫొటోలు వైరల్ కావడంతో చాలా మంది అసలు ఎవరీ శోభిత ధూళిపాళ్ల అని గూగుల్​లో సర్చ్ చేస్తున్నారు.

చూడ్డానికి హాలీవుడ్ బ్యూటీలా కనిపించినా.. శోభిత దూళిపాళ్ల అచ్చమైన తెలుగమ్మాయి. ఏపీలోని తెనాలిలో 1993 మే 31న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్ రావు, శాంత రావు. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్‌. వైజాగ్​లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్​లో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ ముంబయికి మారడంతో .. ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్​లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది.

మోడలింగ్​తో ఎంట్రీ..

శోభిత మొదట మోడలింగ్​లో అరంగేట్రం చేసింది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్​ టైటిల్​ను గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో బాలీవుడ్​లో అనురాగ్ కశ్యప్ మూవీ రమన్ రాఘవ్ 2.0లో నటించింది. ఆ తర్వాత తెలుగులో 2018లో గూడఛారి చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మేజర్​లోనూ సందడి చేసింది. ఇక తమిళ్​లో పొన్నియన్ సెల్వన్ మూవీలోనూ నటించింది. వెబ్ సిరీస్​లలోనూ ఈ భామ తన హవా సాగిస్తోంది. ది నైట్ మేనేజర్​లో నటించి మెప్పించింది. ఇక మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్​లలో పలు సినిమాలు, వెబ్ సిరీస్​లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *