ఈ దేశాల్లో వాట్సాప్ సేవలు బ్యాన్.. కారణం ఏంటంటే?

ManaEnadu:వాట్సాప్‌ (WhatsApp).. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా వినియోగిస్తున్న మెసెంజర్ యాప్స్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 53కోట్ల మంది యూజర్లున్నారు. ఇంతటి పాపులారిటీ ఉన్న ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాలు నిషేధించాయన్న విషయం మీకు తెలుసా? ఎందుకు నిషేధం విధించారో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉత్తర కొరియా (North Korea)..
డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రాజ్యంలో సాధారణంగానే ఆంక్షలు ఎక్కువ. అత్యంత కఠిన నిర్ణయాలు ఈ దేశంలోనే అమల్లో ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నెంట్ వాడకం పరిమితంగా ఉంటుంది. తమ దేశంలోని సమాచారం బయటకు వెళ్లకుండా కిమ్ ఇక్కడ వాట్సాప్ సేవలపై నిషేధం విధించారు.

చైనాలో(China)..
చైనాలోనూ ఇంటర్నెట్ వాడకంపై కాస్త కఠిన నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఇక్కడి ఇంటర్నెట్‌పై అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓ కన్నేసి ఉంచుతారు. ఇక్కడి గ్రేట్ ఫైర్ వాల్స్ (Fire Walls) చైనా పౌరులు ఇతర దేశాలకు సంబంధించిన యాప్స్ వాడకుండా నిరోధిస్తాయి. ఇక్కడి ప్రజలు వాట్సాప్ స్థానంలో WE -Chat వినియోగిస్తారు.

సిరియా(Syria)లో..
చాలా కాలంగా అంతర్యుద్ధంతో నలుగుతున్న సిరియాలోనూ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అక్కడ జరిగే విషయాలు బయటకు పొక్కకుండా వాట్సాప్‌ను నిషేధించింది ఇక్కడి సర్కార్.

ఇరాన్‌(Iran)లో..
కఠిన చట్టాలు అమలు చేసే దేశాల్లో ఒకటి ఇరాన్. ఈ దేశంలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తున్న కారణంగా వాట్సాప్‌ను ఇరాన్‌లో బ్యాన్ చేశారు.

ఖతార్‌(Qatar)లో..
వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్స్‌ని ఖతార్ ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. కేవలం టెక్స్‌ట్‌ సందేశాలు మాత్రమే పంపుకునేందుకు ఇక్కడ అనుమతి ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)..
ఖతార్ ప్రభుత్వం తరహాలోనే యూఏఈలో కూడా వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్స్‌ నిషేధం.

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పిన రోబో.. వీడియో చూశారా?

ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *