OTTలో మరో తెలుగు హర్రర్​ మూవీ రెఢీ..

మన ఈనాడు:Ritika Singh Horror Movie Valari OTT Release : గురు ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఓ హారర్ చిత్రం ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. పోస్టర్లు చూస్తుంటే భయంకరంగా అనిపిస్తున్నాయి! దాని స్ట్రీమింగ్ వివరాలు ఇలా..

Ritika Singh Horror Movie Valari OTT Release : ఈమె పేరు దివ్య ద‌యా గుణం గల అమ్మాయి. ప్రతి ఒక్కరితో ఎంతో మంచిగా, సరదాగా ఉంటుంది. కానీ ప్రపంచానికి తెలియ‌ని ఓ గ‌తం ఆమె జీవితంలో దాగుంది. ఆమె గతంలో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకుందాం అంటూ ఓ సరికొత్త తెలుగు హారర్ మూవీ ఆడియెన్స్​ను భయపెట్టేందుకు సిద్ధమైంది. దాని పేరే వళరి. గురు ఫేమ్ రితికా సింగ్ ఈ భయపెట్టే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డెరెక్ట్​గా ఓటీటీలో రిలీజ్​కు రెడీ అవుతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

వ‌ళ‌రిలో రితికా సింగ్‌తో పాటు నటుడు శ్రీరామ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. కెప్టెన్ న‌వీన్ నాయుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే శ్రీరామ్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. తాజాగా రితికాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్‌లో రితికా దీనంగా పడుకొని చూస్తు ఉండగా, వెనక వైపు నుంచి దెయ్యం రూపంలో జుట్టు విరబోసుకున్న ఓ బాలిక నిలబడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు వదలనున్నారు.వ‌ళ‌రిని త‌మిళ‌నాడు ప్రజ‌లు సంప్రదాయ‌ ఆయుధంగా వినియోగిస్తుంటారు. 1800 ద‌శ‌కంలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ ఆయుధాన్ని నిషేధించింది. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ కొనసాగ‌నున్నట్లు తెలుస్తోంది. ఇక రితిక డిఫ‌రెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *