
Mana Enadu : ‘అయ్య బాబోయ్ చలి.. దుప్పట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. ఒంటిపై నీటి చుక్క పడుతుందేమోనని వణికిపోతున్నారు జనం.’ తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజాకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 10 దాటినా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగర ప్రజలు చలిపులికి వణుకుతున్నారు.
హైదరాబాద్ లో చలిపులి పంజా
నగరంలోని మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్చెరు 11.7, షాపూర్ నగర్ 11.7, ఇక లింగంపల్లి 11.8, బోయిన్పల్లి 11.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
మరోవైపు బేగంపేటలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆసిఫ్‌నగర్ 12, నేరెడ్మెట్ 12.1, లంగర్‌హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట 12.8, మాదాపూర్ 12.8, ముషీరాబాద్ ప్రాంతంలో 12.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక చాంద్రాయణగుట్ట 13, కూకట్పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్‌గూడ 13.3, హయత్ నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వణుకుతున్న ఆదిలాబాద్ జిల్లా
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయని వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిరుమలగిరిలో 13.6, చర్లపల్లిలో 13.6 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని.. తాండ్ర (నిర్మల్)లో 6.3 డిగ్రీలు, పోచర (ఆదిలాబాద్) 6.4, జైనథ్ (ఆదిలాబాద్) 6.5, అర్లి(టి) (ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.
వణుకే వణుకు..
సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం (వికారాబాద్) 6.7, న్యాల్కల్ (సంగారెడ్డి) 6.7, ఎలిమినేడు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్(యూ) (ఆసిఫాబాద్) 6.7, చందనవల్లి (రంగారెడ్డి) 6.7, కోహిర్ (సంగారెడ్డి) 6.7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక మర్పల్లి (వికారాబాద్) 6.8, నగరం(టి) (వికారాబాద్) 6.8, మన్నెగూడ (వికారాబాద్) 6.8, నల్లవెల్లి (సంగారెడ్డి) 6.8, పోతరరెడ్డి పేట (సిద్దిపేట) 6.9, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9, మెనూర్ (కామారెడ్డి) 6.9, రాఘవపేట (జగిత్యాల) 7.3, కెరమెరి (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం చలితో అల్లాడుతున్నారు.